*ప్రతిభకు పురస్కారం... భద్రాచలం ఆర్టిఓ పుల్లయ్యకి దక్కిన గౌరవం*
బిసిఎం10 న్యూస్ ఆగస్టు 16 భద్రాచలం
భద్రాచలం రవాణా శాఖ యూనిట్ కార్యాలయంలో మోటార్ వెహికల్స్ ఇన్స్పెక్టర్‌గా, అలాగే అసోసియేషన్ ఆఫ్ ట్రాన్స్‌పోర్ట్ ఆఫీసర్స్ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మరియు TGOs భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడుగా విధులు నిర్వహిస్తున్న సంగం వెంకట పుల్లయ్య , తన వృత్తి ద్వారా సమాజానికి రోడ్డు భద్రత – ప్రమాదాలు నివారణ కోసం వినూత్న పద్ధతుల్లో అవగాహన తరగతులు నిర్వహిస్తూ, ప్రజల్లో రహదారి భద్రతపై చైతన్యం కల్పించడంలో విశిష్టమైన సేవలు అందించారు.రోడ్డు భద్రత అవగాహనతో పాటు ఆయా సందర్భాలు పురస్కరించుకొని హెల్మెట్స్ పంపిణి చేయడం,ప్రతి ఒక్కరూ పుట్టిన రోజు, పెండ్లి రోజు వంటి ప్రత్యేక సందర్భాలలో, అలాగే లెర్నింగ్ లైసెన్స్, డ్రైవింగ్ లైసెన్స్, వాహన రిజిస్ట్రేషన్ సందర్భాలలో కనీసం ఒక మొక్కను నాటి ప్రేమతో పెంచాలని పర్యావరణ పరిరక్షణకు ప్రోత్సహిస్తున్నారు.రక్తదానం ద్వారా అవసరార్థుల ప్రాణాలను కాపాడాలని, రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు బాధితులను గోల్డెన్ అవర్ లో ఆసుపత్రికి చేర్చేలా చర్యలు తీసుకుని గుడ్ సమారిటన్ గా నిలవాలని పౌర బాధ్యతను గుర్తు చేస్తున్నారు.ఈ సేవలను గుర్తించి, 79వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా "ఉత్తమ రవాణా శాఖ అధికారి" గా ప్రశంసా పత్రంతో సన్మానించారు. ఈ అవార్డును గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారి చేతుల మీదుగా అందుకున్నారు.ఈ కార్యక్రమంలో గౌరవ జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్, IAS, గౌరవ జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ బి. రోహిత్ రాజు, IPS, జిల్లా అధికారులు, ఉద్యోగులు, పుర ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా సంగం వెంకట పుల్లయ్య మాట్లాడుతూ, “నాకు ఈ అవార్డు రావడానికి తోడ్పాటు అందించిన జిల్లా రవాణాశాఖాధికారి వి.వెంకట రమణ గారికి, ఎంపిక చేసిన గౌరవ జిల్లా కలెక్టర్ గారికి, అలాగే నాతో పాటు విధుల నిర్వహణలో భాగస్వామ్యమైన అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. నాకు ప్రోత్సాహం అందించిన మరియు అందిస్తున్న రవాణా శాఖ ఉన్నతాధికారులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ అవార్డు నా వృత్తిపట్ల మరింత బాధ్యతను పెంచింది. ఇకపై ఇంకా ఉత్తమ సేవలు అందించడానికి కృషి చేస్తాను అని తెలియజేసారు.అలాగే వారితో పాటు ఉత్తమ ఉద్యోగిగా ప్రశంసా పత్రాలు అందుకున్న జిల్లా టీజీవో కార్యవర్గ సభ్యులు, గెజిటెడ్ అధికారులు, ఉద్యోగులు, కార్మికులు మరియు రవాణా శాఖలోని ఉద్యోగులందరికీ TGOs భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు” తెలియజేశారు.
0 Comments